జూరాల నుంచి తెస్తే  నారాయణపేటకు నీళ్లొచ్చేవి! :యెన్నం శ్రీనివాస్ రెడ్డి

జూరాల నుంచి తెస్తే  నారాయణపేటకు నీళ్లొచ్చేవి! :యెన్నం శ్రీనివాస్ రెడ్డి
  • పాలమూరు, రంగారెడ్డి సోర్సు మార్చడం వల్ల 
  • పశ్చిమ మహబూబ్​నగర్​ నష్టపోయింది: విప్ యెన్నం

హైదరాబాద్, వెలుగు: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సోర్సును జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు మార్చడం ద్వారా మాజీ సీఎం కేసీఆర్ పశ్చిమ మహబూబ్ నగర్ ప్రాంతం గొంతు కోశారని విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. జూరాల నుంచి తీసుకుంటే నారాయణపేటకు నీళ్లు వచ్చేవని చెప్పారు. మంగళవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు.

వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న ఫాంహౌజ్‌‌‌‌‌‌‌‌కు నీళ్లు తెచ్చుకున్న కేసీఆర్.. జూరాల పక్కనున్న వారికి మాత్రం నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ. 2వేల కోట్ల అంచనా వ్యయంతో మక్తల్– నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తమ ప్రభుత్వం ప్రారంభించిందని, పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.

సీఎం రేవంత్ 3 రోజుల పాటు సొంత ఊరిలో ఉండి రూ.9 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తే.. బీఆర్ఎస్ నేతలు విషం కక్కుతున్నారని, కేసీఆర్ మాత్రం 365 రోజుల్లో 300 రోజులు ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్నాడని ధ్వజమెత్తారు. ఇండస్ట్రీయల్ పార్కుపై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలు విషం కక్కుతున్నారని, గ్రామాలకు గ్రామాలు వచ్చి భూములు ఇవ్వడానికి సిద్ధమయ్యారని, ఎకరాకు రూ.20 లక్షల చొప్పున తమ ప్రభుత్వం పరిహారం ఇస్తే..2 పంటలు పండే భూములకు కేసీఆర్ రూ.4 లక్షల నుంచి 6 లక్షలు మాత్రమే ఇచ్చి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆరోపించారు.