ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేవు.. ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది: జ్యూరీ ఛైర్‌పర్సన్‌ జయసుధ

ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేవు.. ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది: జ్యూరీ ఛైర్‌పర్సన్‌ జయసుధ

తెలంగాణ ప్రభుత్వం నేడు గురువారం (మే29న) గద్దర్ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమకు అవార్డులు ప్రకటించడంతో సినీ వర్గాల్లో సంబరం మొదలైంది.

అవార్డుల నిమిత్తం ఈ కమిటీకి ఏకంగా 1248 నామినేషన్లు రాగా.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, స్క్రీనింగ్ చేసిన తర్వాతే అవార్డుల జాబితా విడుదల చేసింది జ్యారీ. 

ఈ అవార్డులను తెలంగాణ FDC చైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజుతో కలిసి జయసుధ గురువారం ప్రకటించారు. ఇందులో 2024 కి సంబంధించిన సినిమాలకు అవార్డులు ఇచ్చారు. 

ఈ సందర్భంగా జ్యారీ కమిటీ ఛైర్మన్‌ జయసుధ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందంటూ చెప్పింది. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా అవార్డులను ఎంపిక చేశామని జయసుధ తెలిపింది.

దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో సినిమా అవార్డులను ప్రకటించడం సంతోషంగా ఉందని జ్యారీ ఛైర్మన్‌ జయసుధ అన్నారు. సినిమాల్లో పనిచేసేవాళ్లకు అవార్డులే పెద్ద బలంగా ఉంటాయని చెప్పారు.

గద్దర్ అవార్డ్స్ 2024 కోసం 1248 నామినేషన్స్ రాగా 11 కేటగిరీల్లో పురస్కారాలు ప్రకటించామని జయసుధ వెల్లడించింది. అవార్డులకు గెలుచుకున్న సినీ నటులు మరియు సాంకేతిక నిపుణులకు జయసుధ అభినందనలు తెలిపారు. 

4 విభాగాల్లో పురస్కారాలు:

ఇదిలా ఉంటే.. తెలంగాణ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లక్కీ భాస్కర్ సినిమాకు అత్యధికంగా అవార్డులు వచ్చాయి. ఏకంగా నాలుగు విభాగాల్లో పురస్కారాలు అందుకుని ప్రశంసలు అందుకుంది.

ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా డైరెక్టర్ వెంకీ అట్లూరికి, థర్డ్ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ గా లక్కీ భాస్కర్, స్పెషల్ జ్యూరీ అవార్డును హీరో దుల్కర్ సల్మాన్, బెస్ట్ ఎడిటర్ గా నవీన్ నూలి ఇలా నాలుగు విభాగాల్లో లక్కీ భాస్కర్ అవార్డులు అందుకుని సత్తా చాటింది.

గద్దర్ అవార్డుల పూర్తి జాబితా:

2024 బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌:

కల్కి 2898ఏడీ (ఫస్ట్ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌)

పొట్టేల్‌  (సెకండ్ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌)

లక్కీ భాస్కర్‌  (థర్డ్ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌)

టైటిల్ ఆఫ్ ది ఫిల్మ్ ( కమిటీ కుర్రోళ్ళు)

ఉత్తమ నటులు:

ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌ (పుష్ప 2)

ఉత్తమ నటి- నివేదా థామస్‌ (35 ఇది చిన్న కథ కాదు)

ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)

ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)

ఉత్తమ దర్శకుడు:

 నాగ్‌ అశ్విన్ (కల్కి)

ఉత్తమ సంగీత దర్శకుడు:

భీమ్స్ సిసిరోలియో (రజాకార్‌)

ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్‌ శ్రీరామ్‌ (ఊరి పేరు భైరవకోన)

ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్‌ (పుష్ప 2)

స్పెషల్ జ్యూరీ అవార్డు:

అనన్య నాగళ్ల (పొట్టేల్)

దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)

ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2)

ఉత్తమ బాలల చిత్రం:

నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)

ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డు:

యాట సత్యనారాయణ తెరకెక్కించిన (రజాకార్)

ఉత్తమ స్క్రీన్ ప్లే:

వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ హాస్యనటులు:

వెన్నెల కిషోర్‌, సత్య

బెస్ట్ సినిమాటోగ్రఫీ:

విశ్వనాధ్ రెడ్డి (గామి)

బెస్ట్ లిరిసిస్ట్:

చంద్రబోస్ (రాజు యాదవ్)

బెస్ట్ ఎడిటర్:

నవీన్ నూలి (లక్కీ భాస్కర్)

ఉత్తమ కొరియోగ్రాఫర్‌:

గణేష్‌ ఆచార్య (దేవర)

ఉత్తమ రచయితలు:

ఉత్తమ కథా రచయితల-శివ పాలడుగు

ఉత్తమ పుస్తకం-రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం)