Samantha Post : జిమ్‌లో సమంత కసరత్తులు

Samantha Post : జిమ్‌లో సమంత కసరత్తులు

ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుంచి బయటపడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ జిమ్ లో కసరత్తులు చేస్తోంది. యశోద చిత్రం తర్వాత కాస్త విరామం తీసుకున్న సామ్... ఇన్నాళ్లు ఇంట్లోనే చికిత్స తీసుకుంది. ఇటీవలే మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన సమంత.. తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ సిరీస్ చిత్రీకరణలో పాల్గొంటుండగా.. మరికొన్ని రోజుల్లో విజయ్‌ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమా షూటింగ్‌లోనూ జాయిన్ కానుంది. ఈ సందర్భంగా సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఆమె అభిమానులను మరింత ఇన్స్ పైర్ చేస్తోంది. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న వీడియోను షేర్ చేసిన సమంత.. ‘చూసేందుకు ఇది చాలా సులభంగా ఉంది. కానీ అంత ఈజీ కాదు. మీరు ట్రై చేస్తారా..?’ అంటూ పోస్టు చేసింది. దాంతో పాటు తనను తాను మరింత స్ట్రాంగ్‌గా మార్చుకునేందుకు ఇదో అవకాశం.. అంటూ క్యాప్షన్‌ ను జోడించింది. ఈ పోస్ట్ పై నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సామ్ ఈజ్ బ్యాక్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా సామ్ తిరిగొచ్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు.