హైకోర్టు కొత్త సీజే సతీష్​ చంద్ర ప్రమాణ స్వీకారం

హైకోర్టు కొత్త సీజే సతీష్​ చంద్ర ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్పీకర్ పోచారం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ 1961 నవంబర్  30న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జన్మించారు. ప్రాథమిక విద్య జబల్ పూర్ లోని సెంట్రల్  స్కూల్ లో పూర్తి చేశారు. 1981లో సాగర్ లోని డాక్టర్  హరిసింగ్ గౌర్  విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందారు. మూడు సబ్జెక్టుల్లో డిస్టింక్షన్  సాధించి నేషనల్  మెరిట్  స్కాలర్  షిప్  పొందారు. అదే విశ్వవిద్యాలయం నుంచి 1984లో LLB డిగ్రీ పొందారు. అందులోనూ మూడు బంగారు పతకాలు సాధించారు. 1984 సెప్టెంబర్  1న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1993లో అడిషినల్  సెంట్రల్  గవర్నమెంట్  కౌన్సెల్ గా నియమితులయ్యారు. 2004లో సీనియర్  ప్యానెల్  కౌన్సెల్ గా పదోన్నతి పొందారు. 

2003లో మధ్యప్రదేశ్  హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదాను పొందారు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ . 42 ఏళ్లకే ఈ హోదా పొందిన వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్  హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన పలు నేషనల్ లా యూనివర్సిటీలతోనూ ఆయనకు సంబంధాలున్నాయి. ఆగస్ట్ 31 నుంచి కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగారు. తాజాగా తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

మరిన్ని వార్తల కోసం..

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్ల మృతి

నాలుగు రోజుల్లో మరో తుఫాన్‌.. 16 వరకూ వర్షాలు!

కశ్మీరు‌ లోయలో.. మంచు కురిసే వేళలో..