ఇండియాలో జస్టిన్ బీబర్ ప్రదర్శన

ఇండియాలో జస్టిన్ బీబర్ ప్రదర్శన

వాషింగ్టన్ : కెనడియన్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. జస్టిన్‌ పాటలకు ఫిదా అయ్యేవారు ఇండియాలో సైతం ఉన్నారు. చిన్న వయసులోనే బేబీ.. బేబీ అంటూ పాడి ఎంతో మంది సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్నాడు. జస్టిన్ బీబర్ త్వరలో భారత్ లో పర్యటించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీన ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రదర్శన ఇవ్వనున్నాడు. ఇప్పటికే కచేరీ టిక్కెట్లను అమ్ముతున్నారు. వాటి ధర రూ. 4,000 నుండి ఉన్నాయి. పాక్షిక ముఖం పక్షవాతంతో బాధపడుతున్న జస్టిన్ అంతకుముందు ఉత్తర అమెరికాలో చాలా వరకు తన ప్రదర్శనలను రద్దు చేసుకున్నాడు. డాక్టర్ల సలహాలు, సూచనలతో ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. జస్టిన్ కు వచ్చిన హెల్త్ సమస్యతో మిలియన్ల మంది ఆయన అభిమానులు ఆందోళన చెందారు.

తనకు వచ్చిన హెల్త్ సమస్య గురించి జస్టిన్ బీబర్ ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించాడు. ‘నేను రామ్‌ సే హంట్‌ సిండ్రోమ్‌ (ramsay hunt syndrome)తో బాధపడుతున్నాను. ఈ వ్యాధి వల్ల నా ముఖ భాగంలోని నాడీ వ్యవస్థ దెబ్బతిన్నది. దీంతో ముఖం పక్షపాతానికి గురైంది. కదలికలు సరిగా లేవు. కుడి కన్ను ఆర్పలేకపోతున్నా’ అని చెప్పుకొచ్చాడు. దీని శరీరం కూడా మెల్లిగా శక్తి లేకుండా పోతుంది. తనలో ఈ వ్యాధి లక్షణాలో కాస్తా ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే తాను వరల్డ్‌ టూర్‌ క్యాన్సల్‌ చేసుకున్నానని చెప్పాడు. ‘టొరంటో, వాషింగ్టన్ డీసీ, ఇండియా టూర్‌ రద్దు చేసుకున్నాను. పూర్తిగా కోలుకునే వరకు ఎటువంటి సంగీత ప్రదర్శనలు చేయలేను’ అని తెలిపాడు. తమ అభిమాన గాయకుడు ఈ ముఖ పక్షవాతం నుండి వీలైనంత త్వరగా కోరుకోవాలని జస్టిన్ అభిమానులు ప్రార్ధిస్తున్నారు.