నాగపూర్లో జ్యేష్ట పశువైద్య ప్రతిష్టాన్ ట్రస్ట్ అవార్డుల ప్రదానోత్సవం

నాగపూర్లో జ్యేష్ట పశువైద్య ప్రతిష్టాన్ ట్రస్ట్ అవార్డుల ప్రదానోత్సవం

మహారాష్ట్రలోని నాగపూర్లో జాతీయస్థాయి 'జ్యేష్ట పశువైద్య ప్రతిష్టాన్' ట్రస్ట్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో పాటు కరీంనగర్కు చెందిన మైత్రిగూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. వార్షిక్ పురస్కార్ వితరన్ సత్కార్ సమారోహ్ – 2023 పేరుతో ఈ వేడుక జరిగింది. సుమారు 400 మంది వెటర్నరీ ప్రముఖులు ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా పశుసంవర్థక రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి రెండేళ్లకోసారి ఉత్తమ ప్రతిభ అవార్డులను ప్రదానం చేస్తారు.

గో సంరక్షణతో పాటు పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఈ సంస్థ అండగా నిలుస్తున్నట్లు మైత్రీ గ్రూప్ తెలిపింది. తన కుటుంబంతో పశు సంవర్థక రంగానికి అనుబంధం ఉందని.. తన అన్న, వదినలు వెటర్నరీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నారని కొత్త జైపాల్ రెడ్డి తెలిపారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి వేదిక పంచుకోవడం తన అదృష్టమన్నారు.