ఎలక్టోరల్ బాండ్లతో పారదర్శకత : లక్ష్మణ్

ఎలక్టోరల్ బాండ్లతో పారదర్శకత :  లక్ష్మణ్

బ్లాక్​మనీకి ఆస్కారం లేకుండా మోదీ దీన్ని తెచ్చారు

హైదరాబాద్, వెలుగు: ఎలక్టోరల్ బాండ్లతో పార్టీలకు ఇచ్చే విరాళాల్లో పారదర్శకత వచ్చిందని ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. గతంలో ఏ పార్టీకి ఎంత విరాళం వచ్చిందో తెలిసేది కాదని, కానీ ఇప్పుడు ఎలక్టోరల్ బండ్లతో ఎవరికి ఎంత ఇచ్చారో తెలుసుకోవచ్చని చెప్పారు. బ్లాక్​మనీకి ఆస్కారం లేకుండా ప్రధాని మోదీ ఈ విధానం తెచ్చారని చెప్పారు.

 గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్లను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, రాహుల్ గాంధీ విరాళాలు పొందలేదా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలతో కార్పొరేట్లను బెదిరించి బాండ్లు తీస్కుంటున్నారని రాహుల్ విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఈ బాండ్లతో మొత్తం విరాళాల్లో బీజేపీకి 37శాతమే అందాయని అన్నారు. లక్ష్మణ్​ సమక్షంలో మాజీ టీచర్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత వెంకటేశ్ గౌడ్ బీజీపీలో చేరారు.