కేసీఆర్ కు ఉండవల్లి అరుణ్ కుమార్ అమ్ముడుపోయారు : కేఏ పాల్

కేసీఆర్ కు ఉండవల్లి అరుణ్ కుమార్ అమ్ముడుపోయారు : కేఏ పాల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ, స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా.. సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రశ్నించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అమ్మడుపోయారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయం అంటూనే.. తమ అజెండా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అదానీ, అంబానీలకు లక్షల కోట్లు ఇస్తున్నారని ఆరోపించారు. 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీ వేయాలని కేఏ పాల్ కోరారు. స్టీల్ ప్లాంట్ అమ్మితే.. స్టేట్ గవర్నమెంట్ కు అమ్మండని, తామే నడుపుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. ప్రైవేటీకరణకు 99 శాతం రెడీ అయ్యారని, ఎన్నికలు కావటంతో రాజకీయాల కోసం డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 3 వేల 500 కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నాయని చెప్పారు. అప్పట్లో ఒక ఎకరం 2, 3 లక్షలు మాత్రమే అని చెప్పారు.