సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది : కేఏ పాల్

సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది :  కేఏ పాల్

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కొనియాడారు.  రేవంత్ పర్ఫెక్ట్ లీడర్ అని ప్రశంసించారు.   కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి అసలు పోలికే లేదన్నారు. కేసీఆర్ డిక్టేటర్ లా వ్యవహరిస్తే.. రేవంత్ మాత్రం ప్రజల కోసమే పని చేస్తున్నారన్నారు. గడిచిన పదేళ్లు కేసీఆర్ రాష్టాన్ని అప్పుల కుప్పగా మారుస్తే..  రేవంత్ తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతారని నమ్మకం ఉన్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఈ మేరకు అసెంబ్లీ ఆవరణలో కేఏ పాల్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు అసెంబ్లీకి వచ్చినట్లుగా తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే  తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడం కోసం  తాను, సీఎం రేవంత్ రెడ్డి కలిసి విదేశీ పర్యటనకు వెళ్తామని చెప్పారు. మరోవైపు.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు కేఏ.పాల్ ప్రకటించారు.