Viveka Murder Case : మరోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి

Viveka Murder Case : మరోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. సీబీఐ విచారణపై ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

సీబీఐ విచారణపై స్టేకు హైకోర్టు నిరాకరించింది. సీబీఐ విచారణలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐకి హైకోర్డు ఆదేశించింది. వివేకా హత్య కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోవద్దని, తదుపరి విచారణ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషన్‌లపై ఉత్తర్వులు వెలువరించేదాకా ఎంపీ అవినాష్‌రెడ్డిపై అరెస్టు సహా కఠిన చర్యలు తీసుకోరాదంటూ సీబీఐని హైకోర్టు సోమవారం ఆదేశించింది.

పార్లమెంట్‌ సమావేశాల కారణంగా మంగళవారం సీబీఐ ముందు హాజరు నుంచి మినహాయించాలంటూ ఉత్తర్వులు ఇవ్వాలన్న అవినాష్‌రెడ్డి అభ్యర్థనను తిరస్కరించింది. ఇదే విషయాన్ని సీబీఐకి తెలియజేయాలని చెప్పింది.