కడెం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటి విడుదల

కడెం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటి విడుదల

కడెం, వెలుగు: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుందని గురువారం ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లోగా ప్రాజెక్టులోకి 44,091 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో 5 గేట్లు ఎత్తారు. 55,565 క్యూసెక్కుల నీటిని దిగవనున్న గోదావరిలోకి వదులుతున్నట్లు చెప్పారు. 

కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (4.699 టీఎంసీలు) కాగా ప్రస్తుత నీటి మట్టం 697.125 అడుగులు (3.994 టీఎంసీల) సామర్థ్యం కొనసాగుతోంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహ ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని ప్రాజెక్టు అధికారులు సూచిస్తున్నారు.