
వరలక్ష్మీ వ్రతం వంటే శ్రావణ మాసంలో మహిళలకు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేస్తారు. ఒక్కో చోట ఒక్కో విధంగా అమ్మవారిని అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు మహిళలు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ అమ్మవారిని ఏకంగా కరెన్సీ నోట్లతో అలంకరించారు. రూ. 500 నోట్లు, రూ.200 నోట్లు, రూ. 100 నోట్లు, రూ.50,రూ. 20నోట్లు, 10 నోట్లతో అలంకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక శ్రీ పుంతలో ముసలమ్మ వారిని రూ. 30 లక్షల నోట్లతో అద్భుతంగా అలంకరించారు. శ్రావణమాసం వరలక్ష్మి దేవి వ్రత సందర్భంగా ఆగస్టు 8న శుక్రవారం ఈ అమ్మవారికి అలంకరణ జరిగింది. ధనలక్ష్మి అమ్మవారిగా శ్రీ ముసమ్మవారు దర్శనమిస్తున్నారు. సిరులను కురిపించే ధనలక్ష్మి దేవిగా కొత్త నోట్లతో అమ్మవారు కళకళలాడిపోతున్నారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూ కడుతున్నారు.
Also Read : పిస్తా బర్ఫీ, పన్నీర్ ఖీర్ఇంట్లో తయారీ రెసిపీలు.. మీ కోసం
వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా ఆచరిస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు.