నవోదయ అడ్మిషన్ల గడువు పొడిగింపు

నవోదయ అడ్మిషన్ల గడువు పొడిగింపు

మంచిర్యాల, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరం కాగజ్ నగర్ నవోదయ విద్యాలయంలో 9, 11క్లాస్ లలో ఖాళీ సీట్లలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులకు ఈ నెల 7 వరకు గడువు పొడిగించినట్టు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్ల నుంచి 8 క్లాస్ చదువుతున్న విద్యార్థులు 9 క్లాస్ కు, టెన్త్ చదువుతున్న విద్యార్థులు 11 క్లాస్ లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 

9 క్లాస్ కోసం https://cbseitms.nic.in/2025/nvsix_9, 11 క్లాస్ కోసం https://cbseitms.nic.in/2025/nvsxi_11 వెబ్ సైట్ ద్వారా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చని సూచించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.