అక్టోబర్ 30న కాజల్ పెళ్లి..

అక్టోబర్ 30న కాజల్ పెళ్లి..

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో  ఒకరైన కాజల్ అగర్వాల్ పెళ్లిపై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును పెళ్లిచేసుకుంటుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి కాజల్ అగర్వాల్ పుల్ స్టాప్ పెట్టింది. అక్టోబర్ 30న  గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకోబోతున్నట్లు ట్విట్టర్లో తెలిపింది. ముంబైలోని ఓ హోటల్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి జరుగుతున్నట్లు చెప్పింది. కోవిడ్ నిబంధనల వల్ల తక్కువ మందితో  జరుగుతున్నట్లు చెప్పింది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందకు తానుచాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్నందకు మీ సపోర్ట్ కావాలని..తమను  ఆశీర్వదించాలని కోరింది. పెళ్లి తర్వాత కూడా తాను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని ట్వీట్ చేసింది కాజల్. ప్రస్తుతం కాజల్ తెలుగులో చిరంజీవి, కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఆచార్యలో నటిస్తుంది. అలాగే తమిళ్ లో కమల్ హాసన్,శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు2లో నటిస్తుంది.