
కాజల్ అగర్వాల్..టాలీవుడ్ ఒకప్పటి నెం.1 హీరోయిన్. లక్ష్మీ కల్యాణంతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చందమామ తొలి హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు అన్న తేడా లేకుండా వరుసగా నటిస్తూ..తెలుగులో టాప్ హీరోయిన్గా ఎదిగింది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నెం .150లో నటించింది. అంతేకాకుండా పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళితో మగధీరలో యాక్ట్ చేసి గుర్తింపు పొందింది. కెరియర్ మంచి స్టేజ్‌లో ఉండగానే తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. మ్యారేజ్ అయిన ఏడాదిన్నరకు కాజల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 2022 ఏప్రిల్ లో కాజల్‌కు బాబు పుట్టాడు. ఆ బాబుకు నీల్ కిచ్లుగా నామకరణం చేసింది. అయితే అప్పుడప్పుడు తన కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్..తాజాగా కుమారుడి పక్కనే పడుకుని ఉన్న ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
గతంలో షేర్ చేసిన ఫోటోల్లో కాజల్ తన కొడుకు ముఖాన్ని చూపించలేదు. అయితే తాజాగా పోస్ట్ చేసిన ఫోటోల్లో మాత్రం కాజల్ తన కొడుకు ముఖాన్ని కొద్దిగా చూపించింది. నీల్ కిచ్లూ.. నా జీవితానికి దొరికిన ప్రేమ..గుండెచప్పుడు” అంటూ తల్లి ప్రేమను కామెంట్ రూపంలో పెట్టింది. దీంతో ఈ ఫోటోపై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. క్యూట్‌గా ఉన్నాడంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
1985 జూన్ 19న ముంబాయిలో జన్నించిన కాజల్.. మొదట్లో మోడలింగ్ చేసింది. ఆ తర్వాత యాక్టర్‌గా కెరియర్ ప్రారంభించింది. 2007లో వెండితెరకు పరిచమైన కాజల్.. తెలుగు, తమిళ భాషల్లో నటించింది. పెళ్లయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పిన కాజల్..చివరగా ఆచార్యలో నటించింది. ఇక ప్రస్తుతం కాజల్ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో బరువు పెరిగిన ఈ మిత్రవింద...ప్రస్తుతం నార్మల్‌గా కనిపిస్తోంది.