
సెకెండ్ ఇన్సింగ్స్‌లోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది కాజల్ అగర్వాల్. సోమవారం ఆమె బర్త్ డే సందర్భంగా తన 60వ సినిమాని అనౌన్స్ చేశారు. కాజల్ లీడ్‌గా నటిస్తున్న ఈ మూవీ టైటిల్, గ్లింప్స్‌ను ఆదివారం దర్శకుడు శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. ‘సత్యభామ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కాజల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీగా కనిపించనుంది. ‘మేజర్’ డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పణలో ఆయన సోదరుడు బాబీ తిక్క, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. అఖిల్ దేగల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘కాజల్ ఇప్పటికీ ‘మగధీర’లో మిత్రవిందాలానే ఉంది. ఫస్ట్ గ్లింప్స్ చాలా బాగుంది. కాజల్ చెప్పిన డైలాగ్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. యంగ్ టీమ్ అంతా కలిసి చేసిన ఈ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేస్తున్నా’ అన్నారు. కాజల్ మాట్లాడుతూ ‘ఈ బర్త్‌డే నాకు వెరీ స్పెషల్. ‘సత్యభామ’ లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు’ అని చెప్పింది. తన ఫస్ట్ మూవీనే కాజల్ లాంటి స్టార్‌ను డైరెక్ట్ చేయడం హ్యాపీ అన్నాడు అఖిల్. శశికిరణ్, బాబీ, శ్రీనివాసరావుతో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.