కొడుకుతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన కాజల్

కొడుకుతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన కాజల్

కాజల్ అగర్వాల్... ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయంలేదు. ఎందుకంటే దశాబ్దం పాటు అందం, అభినయంతో ఈ బ్యూటీ ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.  అయితే కెరీర్ పీక్స్ లో  ఉండగానే ఇటీవలే గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తని మ్యారేజ్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది కాజల్. కాగా... ఈ జంటకి ఇటీవలే ఓ కొడుకు పుట్టాడు. అతడికి నీల్ కిచ్లూ అని పేరు పెట్టారు. మొన్నటి వరకు టాప్ హీరోయిన్ గా వెలుగొందిన కాజల్... ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలోనే తన కొడుకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. కానీ.. కాజల్ ఇప్పటివరకూ తన కొడుకు ముఖాన్ని రివీల్ చేయలేదు.

అయితే తాజాగా... కాజల్ అగర్వాల్ తన కొడుకు నీల్ తో కలిసి బాహుబలి మూవీలోని ఓ సీన్ ను రీక్రియేట్ చేసింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బాహుబలి..ది బిగినింగ్’ లోని కట్టప్ప తలపై బాహుబలి కాలు పెట్టే సీన్ ను కొడుకుతో రీక్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో కాజల్ షేర్ చేసింది. దానికి.. ‘ఎస్‌ఎస్ రాజమౌళి సార్. ఇది నీల్, నా డేడికేషన్. అందరిలా మేము కూడా ఎలా ఇన్‌స్పైర్ కాకుండా ఉంటాం’ అని రాసుకొచ్చింది. అలాగే ఈ స్టోరీలో.. రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, కార్తీకేయని ట్యాగ్ చేసింది.