పవర్‎ఫుల్ లాయర్‎గా కాజల్.. విస్తుపోయే వాస్తవాలతో ది ఇండియన్ స్టోరీ 

పవర్‎ఫుల్ లాయర్‎గా కాజల్.. విస్తుపోయే వాస్తవాలతో ది ఇండియన్ స్టోరీ 

కాజల్ అగర్వాల్ ప్రధానపాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ది ఇండియన్ స్టోరీ’. శ్రేయస్‌‌ తల్ఫడే కీలకపాత్ర పోషిస్తున్నారు. చేతన్ డీకే ఈ కోర్ట్ రూమ్ డ్రామాకు దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో సాగర్ బి షిండే నిర్మిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్‌‌ పవర్‌‌‌‌ఫుల్‌‌ లాయర్‌‌‌‌గా కనిపించనుంది. శుక్రవారం టీజర్‌‌‌‌ను విడుదల చేశారు. పురుగుమందుల వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న   ప్రభావం, ఆహార కల్తీ అంశాలను ప్రధానాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని  తెరకెక్కిస్తున్నారు.

‘‘50 వేలకు పైగా మెట్రిక్‌‌ టన్నుల పురుగు మందులు వాడుతున్నాం.. 20 కోట్ల మంది ప్రజలు వీటి బారిన పడ్డారు.. ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం క్యాన్సర్‌‌‌‌తో పోరాడుతోంది, ప్రతి ఏడాది పది లక్షల మంది చనిపోతున్నారు..” అంటూ గణాంకాలతో సహా ఈ సమస్య తీవ్రతను టీజర్‌‌‌‌లో చూపించారు. సమాజాన్ని ఆలోచింపజేసేలా విస్తుపోయే వాస్తవాలను ఇందులో చూపించబోతున్నట్టు తెలియజేశారు. జులై 24న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.