కాజల్ ఈజ్ ద బెస్ట్

కాజల్ ఈజ్ ద బెస్ట్

ఏ హీరోయిన్‌కైనా యేళ్లు గడిచేకొద్దీ గ్లామర్ తగ్గుతుంది. క్రేజ్ తగ్గుతుంది. కెరీర్‌‌ కూడా డల్ అవుతుంది. కానీ కాజల్‌ కహానీ దీనికి పూర్తి విరుద్ధం. కెరీర్ స్టార్ట్ చేసి పద్నాలుగేళ్లు దాటినా ఇప్పటికీ టాప్ హీరోయిన్‌గానే కొనసాగు తోంది. ఇండస్ట్రీలోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా వెలిగిపోతోంది. రీసెంట్‌గా కాజల్ చేసిన ఫొటో షూట్స్‌ క్షణాల్లో వైరల్ అయిపోయాయి. ఎంత మంది ఉన్నా, ఇంకెంత మంది కొత్తవాళ్లు వచ్చినా కాజల్ ఈజ్ ద బెస్ట్ అంటున్నారు నెటిజన్స్. ఇక సినిమాల విషయానికొస్తే ఆమె చేతిలో చాలా క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. మలయాళంలో ‘హే సినామికా’ మూవీ కంప్లీట్ చేసింది. ప్యాన్ ఇండియా మూవీ ‘ఉమ’ షూటింగ్‌ను ఈ మధ్యనే పూర్తి చేసింది. తమిళంలో ‘ఘోస్టీ’ అనే  పొలిటికల్ థ్రిల్లర్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. మరో లేడీ ఓరియెం టెడ్ మూవీ షూటింగ్ జరుగుతోంది. కాంట్రవర్శీ లతో ఆగిపోయిన ‘ఇండియన్ 2’ త్వరలోనే తిరిగి మొదలు కానుంది. ఇక తెలుగులో ‘ఆచార్య’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నాగార్జునతో చేస్తున్న ‘ద ఘోస్ట్’ చిత్రం సెట్స్​పై ఉంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకుందని, ఆమె స్థానంలో జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ని తీసుకున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజమో కాదో తెలీదు కానీ.. ఈ లైనప్ చూస్తుంటే కాజల్ క్రేజ్ అస్సలు తగ్గలేదని మాత్రం అర్థమౌతోంది.