బాలయ్యతో మరోసారి నటించనున్న కాజల్

బాలయ్యతో మరోసారి నటించనున్న కాజల్

ఇరవై ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ.. ఇప్పటికీ అదే స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డమ్‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తోంది కాజల్ అగర్వాల్. మూడేళ్ల క్రితం బాలకృష్ణ  నటించిన  ‘భగవంత్ కేసరి’లో కీలక పాత్రతో మెప్పించిన కాజల్.. మరోసారి బాలయ్య మూవీలో చాన్స్ అందుకుందని తెలుస్తోంది.   బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో  ఓ హిస్టారికల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 

ఇందులో  హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నయనతార నటించబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా ఆమె ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కాజల్ చోటు దక్కించుకుందనే టాక్ టాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం నయనతార  హిందీలో సల్మాన్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ చిత్రంతోపాటు మరో రెండు భారీ చిత్రాలకు కమిట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ ఉండటం వలన, ఆమె కాల్షీట్లు మేకర్స్‌ కు కష్టతరంగా మారింది.  అందుకే దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రత్యామ్నాయంగా కాజల్ అగర్వాల్‌‌‌‌‌‌‌‌ను  సంప్రదించి ఆమెకు కథను చెప్పాడట.

 కథ నచ్చడంతో కాజల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఆమె సెట్స్‌‌‌‌‌‌‌‌లో జాయిన్ కానుంది.   బాలకృష్ణ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 111వ సినిమా కాగా,   ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి.  వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.