Kajol: పెళ్లికి ఎక్స్ పైరీ డేట్ ఉంటే ఎంత బాగుండో.. కాజోల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం!

Kajol: పెళ్లికి ఎక్స్ పైరీ డేట్ ఉంటే ఎంత బాగుండో..  కాజోల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం!

సాధారణంగా మనం తినే ఆహారపదార్థాలకు , వాడే వస్తువులను ఎక్స్ ఫైరీ డేట్స్ ఉంటాయి. అయితే వాటికి ఉన్నట్లే వివాహ బంధానికి కూడా ఎక్స్‌పైరీ డేట్,  రెన్యువల్ ఆప్షన్ ఉండాలని  బాలీవుడ్ నటి కాజోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  అది తప్పేం కాదని సమర్థించారు. కాజోల్ తన స్నేహితురాలు ట్వింకిల్ ఖన్నా తో కలిసి హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ (Two Much with Kajol and Twinkle) లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఈ ఆసక్తికర చర్చ జరిగింది.  ఈ షోకు బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్ , కృతి సనన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాజోల్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 

పెళ్లి.. వాషింగ్ మెషీన్ కాదు!

ఈ షోలోని 'దిస్ ఆర్ దట్' సెగ్మెంట్‌లో పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్,  రెన్యువల్ ఆప్షన్ ఉండాలా? అని ట్వింకిల్ ఖన్నా ఒక ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు విక్కీ కౌశల్, కృతి సనన్ , ట్వింకిల్ ఖన్నా తీవ్రంగా విభేదించి రెడ్ జోన్‌లో నిలబడ్డారు.  అయితే, కాజోల్ మాత్రం ఈ ఆలోచనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, రెన్యువల్ ఆప్షన్ ఉండడం తప్పేమీ కాదని సమర్థించారు. సరైన సమయంలో, సరైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నామన్న గ్యారెంటీ ఏముంది? ఒకవేళ ఎక్స్‌పైరీ డేట్ ఉంటే, తప్పుగా ఎన్నిక చేసుకున్న బంధంలో జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉండదు. రెన్యువల్ ఆప్షన్ ఉంటే, ఉన్నచోటే ఆగిపోకుండా ముందడుగు వేయొచ్చు అని కాజోల్ వివరించారు.  ఇది పెళ్లి, వాషింగ్ మెషీన్ కాదు అంటూ ట్వింకిల్ తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు. దీనికి కృతి సనన్ నవ్వుతూ స్పందిస్తూ.. ఈ ఆప్షన్‌కి కాజోల్ ఓకే అంటే.. ఇక ఇంట్లో అజయ్ దేవగణ్ పరిస్థితి చాందీ అయినట్లే అని చమత్కరించింది.

డబ్బు సంతోషాన్ని కొనుగోలు చేయగలదా?

అదే సెగ్మెంట్‌లో.. డబ్బు సంతోషాన్ని కొనుగోలు చేయగలదా? అనే ప్రశ్న కూడా వచ్చింది. దీనికి ట్వింకిల్ , విక్కీ వెంటనే అంగీకరించగా, కాజోల్ మాత్రం విభేదించారు. ఎంత డబ్బు ఉన్నా, సంతోషాన్ని కొనుగోలు చేయలేదు. కొన్నిసార్లు, డబ్బు సంతోషానికి అడ్డుగా కూడా మారుతుంది అని కాజోల్ అన్నారు.

కామన్ఎక్స్ మ్యాటర్


మరో ఆసక్తికర అంశం ఏమంటే.. బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరి ఎక్స్‌ను మరొకరు డేటింగ్ చేయకూడదు అనే దానిపై చర్చకు వచ్చింది. ఈ టెంలో ట్వింకిల్ ఖన్నా కాజోల్ భుజంపై చెయ్యి వేసి మా ఇద్దరికీ ఒక కామన్ ఎక్స్ ఉన్నాడు, కానీ ఆ విషయం చెప్పలేం అంటూ రహస్యాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. వెంటనే కాజోల్ కలుగజేసుకుని, ఎవరికీ తెలియకుండా ఉండటానికి నోరు మూయ్ అంటూ ట్వింకిల్‌ను వారించింది. 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' టాక్ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రతి గురువారం ఒక కొత్త ఎపిసోడ్‌తో స్ట్రీమ్ అవుతోంది. ఈ షో బాలీవుడ్ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను బయటపెడుతుందని అభిమానులు భావిస్తున్నారు. 

►ALSO READ | బెట్టింగ్ యాప్ కేసులో సిట్ విచారణకు హాజరైన నటుడు ప్రకాశ్ రాజ్