సిద్దిపేట, వెలుగు: నేటి నుంచి సిద్దిపేటలో కాక క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా వివిధ జట్ల మధ్య క్రికెట్ పోటీలు జరగనున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్, తెలంగాణ ఇంటర్ డిస్టిక్ టీ 20 లీగ్ లో భాగంగా ఫేస్ త్రీలో పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
మొదటి మ్యాచ్ ఖమ్మం, హైదరాబాద్ మధ్య జరగనుండగా, రెండో మ్యాచ్ మహబూబ్ నగర్, వరంగల్ జట్ల మధ్య జరగనుంది. 7న నిజామాబాద్, అదిలాబాద్ జట్ల మధ్య, రంగారెడ్డి, కరీంనగర్ జట్ల మధ్య, మెదక్, నల్గొండ జట్ల మధ్య 3 మ్యాచ్ లు జరగనున్నాయి.
