కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జనగామలో కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్శనివారం ప్రారంభమైంది. సర్పంచ్ మారిశెట్టి పద్మ, మాజీ ఎంపీటీసీ తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన పోటీలను చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ ప్రసాద్ తివారీ, కోటపల్లి ఎస్సై రాజేందర్, చెన్నూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజమల్ల గౌడ్ హాజరై క్రీడలను ప్రారంభించారు.
వారు మాట్లాడుతూ.. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకా కుటుంబం నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తుందన్నారు. గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.
