రేపు కాకా అంబేద్కర్ కాలేజీ గ్రాడ్యుయేషన్ వేడుకలు

రేపు కాకా అంబేద్కర్ కాలేజీ గ్రాడ్యుయేషన్ వేడుకలు

హైదరాబాద్ : బాగ్ లింగంపల్లిలోని కాకా అంబేద్కర్ కాలేజీ గ్రాడ్యుయేషన్ సెర్మెనీ ఈ నెల 3న జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఓయూ లా కాలేజ్ డీన్ ప్రొఫెసర్ జి. వినోద్ కుమార్, గౌరవ అతిధిగా రిటైర్ జడ్జి జస్టిస్ ఎ. రామలింగేశ్వర్ రావు, విశిష్ట అతిధిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎన్. రామ చందర్ రావు హాజరుకానున్నారు. 

గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి చీఫ్ ప్యాట్రన్లుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూట్ ఛైర్మన్ జి. వెంకటస్వామి, సెక్రటరీ జి. వినోద్, కారస్పాండెంట్ జి. సరోజ వివేక్ వ్యవహరించనున్నారు. ఉదయం 10.30గంటలకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది.