అమెరికాలో కేయూ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

అమెరికాలో కేయూ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
  • ఘనంగా నిర్వహించుకున్న  300 మంది వర్సిటీ విద్యార్థులు 

తల్లాడ, వెలుగు : వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ  గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించుకున్నారు. యూనివర్సిటీలో భాగమైన ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాలేజీలో 1976-–2025 వరకు యూజీ, పీజీ పూర్తిచేసి అమెరికాలో వివిధ రంగాల్లో స్థిరపడిన సుమారు 335 మంది ప్రవాస భారతీయులు అట్లాంటిక్ సిటీలోని క్యాసినోని హోటల్లో వర్సిటీ వేడుకలను ఉత్సాహంగా చేసుకున్నారు. 

డాక్టర్ సాంబారెడ్డి, పరుచూరి శ్రీనివాస్, తమర విజయ్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరుపుకున్నారు. కార్యక్రమా నికి చీఫ్ గెస్ట్  కేయూ వీసీ ఆచార్య దర్శన ప్రతాపరెడ్డి, రిజిస్టర్ ప్రొ. వి.రామచంద్రం హాజరై తమ అనుభవాలను ప్రవాస భారతీయులతో పంచుకున్నారు. అమెరికాలో స్థిరపడిన భారతీయులతో పాటు కెనడా, బ్రిటన్ నుంచి కూడా విద్యార్థులు పాల్గొన్నారు.