ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళలు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళలు మృతి

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ప్రైవేట్ బస్సు ఢీ కొట్టడంతో ఆరుగురు అక్కడిక్కడే  మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా యానాంలోని నీలంపల్లికి చెందిన మహిళలుగా గుర్తించారు. 

తాళ్లరేవు మండలం సీతాపురంలో ఈ ప్రమాదం జరిగింది. రొయ్యల ఫ్యాక్టరీలో పని చేసి ఆటోలో తిరిగి వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది.  స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు.