
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ జైలర్ (Jailer). ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. నెల్సన్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహించిన ఈ భారీ సినిమాకు.. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ (kalanithi Maran) నిర్మించారు.
To celebrate the grand success of #Jailer, Mr.Kalanithi Maran presented the key of a brand new Porsche car to @Nelsondilpkumar #JailerSuccessCelebrations pic.twitter.com/kHTzEtnChr
— Sun Pictures (@sunpictures) September 1, 2023
ఇక ఈ సినిమా ఆడించిన భారీ సక్సెస్ తో ఫుల్ ఖుషీలో ఉన్నారు నిర్మాత కళానిధి మారన్. జైలర్ సినిమాకు సక్సెస్‌తో పాటు లాభాలు కూడా రావడంతో.. అందులో కొంత మొత్తాన్ని రజినీకాంత్, నెల్సన్‌కు ఆడించారు కళానిధి మారన్. ఇప్పటికే రజినీకాంత్‌కు రూ.1.24 కోట్ల BMW X7 కారుతో పాటు రూ.100 కోట్ల చెక్కును కూడా అందించారు. ఇక తాజాగా దర్శకుడు నెల్సన్‌కు కూడా పోర్చే లేటెస్ట్ కారు (Porsche Car)ను, చెక్కును అందజేశారు. నెల్సన్‌కు ఇచ్చిన కారు ఖరీదు రూ1.25 వరకు ఉంటుందని అంచనా. ఈ వీడియోను సన్ పిక్చర్స్ సంస్థ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.