
చేవెళ్ల, వెలుగు : కాంగ్రెస్కు పది అవకాశాలు ఇచ్చినా.. పదవులు అనుభవించి ప్రజలకు ఏమీ చేయలేదని చేవెళ్ల సెగ్మెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా వస్తున్నాయా..? కాంగ్రెస పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సెగ్మెంట్ మొయినాబాద్ మండలం అజీజ్ నగర్, అమీర్‌గూడ, షాపూర్ అనంతారం, శంకర్ పల్లి మండలం సింగపూర్ గ్రామాల్లో ప్రజా ఆశీర్వాదయాత్రలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలె యాదయ్య మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, చేవెళ్ల జడ్పీటీసీ సభ్యురాలు మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, వైస్ ఎంపీపీ కర్నే శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.