కేసీఆర్, హరీశ్ ఒత్తిడి పెట్టారు: కాళేశ్వరం కమిషన్తో మాజీ సీఈ, సీడీవో నరేందర్ రెడ్డి

కేసీఆర్, హరీశ్ ఒత్తిడి పెట్టారు: కాళేశ్వరం కమిషన్తో మాజీ సీఈ, సీడీవో నరేందర్ రెడ్డి
  • అందుకే గుడ్డిగా సంతకాలు చేయాల్సి వచ్చింది
  • లొకేషన్స్ ఆధారంగానే డిజైన్ , డ్రాయింగ్స్
  • ప్రతి డిజైన్ లో సీడీవోతోపాటు ఎల్ అండ్ టీ ప్రతినిధులు
  • కన్ స్ట్రక్షన్లలోనూ తప్పిదాలు జరిగాయి
  • బ్యారేజీ గేట్ల ఆపరేషన్ ఆఫీసర్లు, ఎల్ అండ్ టీ సరిగా పని చేయలే
  • కాళేశ్వరం కమిషన్ తో మాజీ సీఈ, సీడీవో నరేందర్ రెడ్డి

హైదరాబాద్: అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఒత్తిడి కారణంగానే డిజైన్స్, డ్రాయింగ్స్ విషయంలో నిబంధనలు పాటించకుండా గుడ్డిగా సంతకం చేయాల్సి వచ్చిందని మాజీ సీడీ, సీడీవో నరేందర్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ కు తెలిపారు. ఇవాళ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుతో పాటు నరేందర్ రెడ్డి కూడా విచారణకు హాజరైన ఆయనను కమిషన్ కీలక అంశాలపై ఆరా తీసింది. డిజైన్, డ్రాయింగ్స్ అనుమతి విషయంలో ఎందుకు నిబంధనలు పాటించలేదని ప్రశ్నించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన చర్చల్లో తాను ఎక్కడా పాల్గొనలేదని, తననెవరూ పిలవలేదని అన్నారు. 

డీపీఆర్ కు గ్రౌండ్ లో ఉన్న నిర్మాణానికి తేడాలున్నాయని కమిషన్ ప్రశ్నించగా.. నిర్మాణ సమయంలో తప్పిదాలు జరిగాయని, అప్పటి ప్రభుత్వ ఒత్తిడితోనే తప్పిదాలు జరిగినట్టు తాను భావిస్తున్నట్టు చెప్పారు. పై అధికారుల ఒత్తిడితోనే క్వాలిటీ కంట్రోల్ చెక్  చేయలేదని అన్నారు. బ్యారేజీల గేట్ల ఆపరేషన్ అధికారులు, కాంట్రాక్టు సంస్థ సరిగా పనిచేయాలని అన్నారు. వర్షాకాలానికి ముందు పాటించాల్సిన నిబంధనలను గ్రౌండ్ లెవల్ అధికారులు, కాంట్రాక్టు సంస్థ పాటించలేదని తెలిపారు. విచారణ సందర్బంగా కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు నరేందర్ రెడ్డి సమాధానాలు చెప్పలేదని సమాచారం.