- ఇది ప్రజాప్రభుత్వం.. మీరు చెప్పింది వింటాం
- సాంకేతిక సమస్యలు కారణం కావచ్చు
- డబ్బులు రెడీగా ఉన్నాయి: సీఎం
హైదరాబాద్: రుణమాఫీ కోసం రైతులు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ లీడర్ల ట్రాప్ లో పడొద్దని విజ్ఞప్తి చేశారు. ‘రుణమాఫీ కాని వారు అధికారులను కలవాలని చెప్పినం.. మీకు కష్టం ఎందుకు వచ్చింది.. ఆరు నెలల్లో 31 వేల కోట్లు మాఫీ చేస్తమని మాట ఇచ్చినం.. 18 వేల కోట్లు చెల్లించినం.. మిగతావి కూడా బ్యాంకుల్లో ఉన్నాయి. వ్యవసాయాధికారులను కలవండి. రోజుకు 18 గంటలు నేను, మంత్రులు గ్రామాల్లో తిరుగుతునే ఉన్నాం.. ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది. ప్రభుత్వం వినకుంటే ధర్నా చేయాలి.. మేం వింటున్నప్పుడు ధర్నా ఎందుకు.?’అని సీఎం అన్నారు.