కేసీఆర్​ చెప్పింది 180 TMCల నీరు లిఫ్టింగ్​... ఐదేళ్లలో మొత్తం 162 TMCల నీరు లిఫ్టింగ్​

కేసీఆర్​ చెప్పింది 180 TMCల నీరు లిఫ్టింగ్​... ఐదేళ్లలో  మొత్తం 162 TMCల నీరు లిఫ్టింగ్​

ప్రతి ఏడాది 180 టీఎంసీలు నీరిస్తామని చెప్పిన గత ప్రభుత్వం  .. ఏ ఏడాది కూడా  ప్రతిపాదించిన నీటిని లిఫ్ట్​ చేయలేదన్నారు.  గత ఏడాది 62 టీఎంఎంసీల నీరు మాత్రమే ఎత్తిపోశారని సీఎం రేవంత్​ అన్నారు. గత ఐదేళ్లలో మొత్తం కలిపి 162 టీఎంసీ నీళ్లను కూడా లిఫ్ట్​ చేయలేదు. మేడిగడ్డ ప్రాజెక్ట్​ కు గత ప్రభుత్వం చేసిన నిర్వాకాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.  ప్రాజెక్ట్​ నిర్మాణంలో నాణ్యతా లోపం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని సీఎం రేవంత్​ అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్​ పిల్లర్లు నిలువునా చీలి ఐరన్​ రాడ్లు బయటకు వచ్చాయన్నారు.  అన్నారం.. సుందిళ్ల ప్రాజెక్ట్​ల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్​లో మొత్తం నీరు నింపితే ఏ పిల్లర్​ కూడా ఉండదని సీఎం కేసీఆర్​ అన్నారు.  2020 లోనే ఎల్​అండ్​ టీ  నోటీసు ఇచ్చిందన్నారు.ప్రస్తుతం తాము అధికారంలో లేమని కేసీఆర్​ చెబుతున్నారని.. అలానే ఎల్​ అండ్​ టీ సంస్థ  కూడా మా అగ్రిమెంట్​ గడువు ముగిసిందని చెపుతున్నారని సీఎం రేవంత్​ అన్నారు.