కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ తప్పిదం వల్లే వరదలు

కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ తప్పిదం వల్లే వరదలు

కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ తప్పిదం వల్లే బ్యాక్ వాటర్ తో వరదలు వస్తున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని అంబేద్కర్ నగర్, సుభాష్ నగర్, మసీదు వాడ, శ్రీపాద చౌక్ ల తో పాటు పునరావాస కేంద్రాలను పరిశీలించి వరద బాధితులను పరామర్శించారు. సీఎం కేసీఆర్ 36 వేల కోట్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో లక్ష కోట్లకు పెంచి ప్రజల సొమ్మును కమీషన్ల రూపంలో కొల్లగొట్టారని విమర్శించారు. మంథని నియోజకవర్గంలో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల 40 వేల ఎకరాల్లో రైతులు నష్టపోతున్నారని చెప్పారు.

ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివేక్ వెంకటస్వామి తెలిపారు. కాళ్ళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల నష్టం జరుగుతుందనే అప్పట్లో పాదయాత్ర సహా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల రైతులు నష్టపోతారని ప్రభుత్వానికి చెప్పిన పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించాలని..లేకపోతే ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమైతామని స్పష్టం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.