Prabhas: 'కల్కి 2 ' లోకి మరో బాలీవుడ్ విలన్ ఎంట్రీ.. ప్రభాస్‌ను ఢీకొట్టే ఆ స్టార్ ఎవరు?

Prabhas:  'కల్కి 2 ' లోకి మరో బాలీవుడ్ విలన్ ఎంట్రీ.. ప్రభాస్‌ను ఢీకొట్టే ఆ స్టార్ ఎవరు?

ఇండియన్ సినీ చరిత్రలో పురాణాలను, సైన్స్ ఫిక్షన్‌ను మేళవించి సంచలనం సృష్టించిన చిత్రం “కల్కి 2898 ఏడీ”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్‌పైనే ఉంది. ప్రస్తుతం ‘కల్కి 2’ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

రంగంలోకి రెబల్ స్టార్

ఈ సీక్వెల్‌కు సంబంధించి అభిమానుల కోసం ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు షూటింగ్‌లో పాల్గొన్నారు. కొంత షూట్ కూడా చేశారు. ఇక ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 10, 2026 నుండి ప్రభాస్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. మొదటి భాగంలో భైరవగా అలరించిన ప్రభాస్, రెండో భాగంలో తన అసలు స్వరూపమైన 'కర్ణుడి'గా విశ్వరూపం చూపించనున్నారు.

టైటిల్ ఫిక్స్? - ‘కర్ణ 3102 బీసీ’

ఈ సీక్వెల్‌కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట నాగ్ అశ్విన్. మొదటి భాగం ముగింపులో ప్రభాస్ పాత్ర కర్ణుడిగా రివీల్ కావడంతో, ఈ రెండో భాగంలో పురాణాల కాలానికి సంబంధించిన సన్నివేశాల  నిడివి ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడి పాత్ర, అశ్వత్థామ శాపం వంటి అంశాలను ప్రస్తుత కాలానికి ముడిపెడుతూ కథ సాగనుందని సమాచారం.

మరో బాలీవుడ్ విలన్ ఎంట్రీ!
వైజయంతీ మూవీస్ భారీ నిర్మాణ విలువలలో రూపొందుతున్న ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపిస్తుండగా, ఆయనకు తోడుగా మరో బాలీవుడ్ నటుడు నెగిటివ్ పాత్రలో మెరవబోతున్నట్లు టాక్. ఈ కొత్త క్యారెక్టర్ ప్రభాస్ పాత్రకు గట్టి సవాల్ విసరనుందట. ఇక ఇప్పటికే ఈ షెడ్యూల్‌లో దుల్కర్ సల్మాన్, జేడీ చక్రవర్తి వంటి నటులు కూడా భాగమైనట్లు వార్తలు వస్తున్నాయి.

►ALSO READ | Viral Video: వెంకీమామ సింప్లిసిటీ వైరల్.. సామాన్యుడిలా హోటల్లో బ్రేక్‌ఫాస్ట్.. నెటిజన్స్ ఫిదా

అశ్వత్థా వర్సెస్ యాస్కిన్‌..

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇప్పటికే అశ్వత్థామగా మేకప్ వేసుకుని యాక్షన్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కమల్ హాసన్, అమితాబ్ కలిసి నటిస్తుండటం ఈ సినిమాకు అతిపెద్ద బలం. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు వెండితెరపై హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ మూవీ భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం ఖాయం అని సినీ వర్గాలు చెబుతున్నాయి..