
- మొదటి రోజే 10 లక్షల టికెట్స్ అమ్ముడైన తొలి ఇండియన్ మూవీ
- అమెరికాలోనూ 25 కోట్లపైనే వసూలు.. నేడే రిలీజ్
హైదరాబాద్, వెలుగు : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు బద్దలుకొట్టింది. మొదటి రోజే 10 లక్షల టికెట్స్ అమ్ముడైన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది. ఇప్పటికే నార్త్ ఇండియాలో దీని అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభాస్ గత సినిమా ‘సలార్’ రికార్డులను బ్రేక్ చేశాయి. ముంబైలోని మైసన్ ఐనాక్స్ థియేటర్‌లో కల్కి మూవీ టికెట్ రూ. 2,300 ధర పలికింది. తొలి రోజు రాత్రి 9.15 గంటల షో కోసం లివింగ్ రూమ్ స్క్రీన్‌లో ఈ రేటు నిర్ణయించారు.
అయినా టికెట్స్ సోల్డ్ అవుట్ అవడం విశేషం. వీకెండ్ కోసం రూ.2000 టికెట్లను కూడా అమ్ముతున్నారు. ఏపీ, నైజాంతో పాటు నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా లాంటి చోట్ల కూడా భారీఎత్తున టికెట్స్ అమ్ముడయ్యాయి.అమెరికాలోనూ తొలిరోజే 25 కోట్లపైనే వసూలు చేయడం గమనార్హం. భారతీయ పురాణ గాథలకు సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించి
ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్‌తో నాగ్ అశ్విన్ తీసిన ఈ చిత్రం గురువారం తెల్లవారుజామునే బెన్ఫిట్షోస్తో ప్రేక్షకుల ముందుకు రానున్నది. వందల కోట్ల బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఇండియన్ సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది.
తొలిరోజే 200 కోట్లు?
ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రా సర్కారు స్పెషల్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చాయి. దీంతో తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100కు టికెట్ ధరలు పెరిగాయి. రెండు వారాల పాటు రోజుకు ఐదు షోస్ వేసుకునేందుకు కూడా అనుమతినిచ్చారు. అలాగే, ఏపీలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.125కు టికెట్ రేట్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో తొలిరోజే ఈ సినిమా దాదాపు రూ.200 కోట్లకు పైనే రాబట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.
Kalki 2898 AD surpasses Salaar Advance Booking#Prabhas #Nagashwin #KALKI2898AD #Salaar #Bujji #Filmifyenglish @deepikapadukone @ikamalhaasan @DishPatani @SrBachchan https://t.co/04k5sNUw6q
— FilmifyOfficial (@FilmifyEnglish) June 27, 2024