కల్కి ఒక  కొత్త ప్రపంచం

కల్కి ఒక  కొత్త ప్రపంచం

ప్రభాస్ నటించిన ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదలవుతోంది. బుధవారం ముంబైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ ‘ఈ ప్రాజెక్టులో పార్ట్ అవడం గ్రేట్ హానర్. ట్రూలీ వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్. ఇదొక కొత్త ప్రపంచం. ఇలాంటి సినిమా గతంలో ఎప్పుడూ చేయలేదు.  ఇలాంటి సినిమాని అలోచించిన నాగ్ అశ్విన్‌‌‌‌‌‌‌‌కి, టీం అందరికీ అభినందనలు. ఇందులో ఉన్న విజువల్స్ అన్ బిలివబుల్. ఈ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ని ఎప్పటికీ మర్చిపోలేను’ అన్నారు. 

 కమల్ హాసన్ మాట్లాడుతూ ‘నాగ్ అశ్విన్ మా గురువుగారు బాలచందర్ గారిలా ఆర్టినరిగా కనిపించే ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రార్డినరీ మేన్.  ఇందులో నేను బ్యాడ్ మేన్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తా.  నాగ్ అశ్విన్ నన్ను చాలా డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా ప్రజెంట్ చేశారు. నా లుక్ చూసి సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ అయినట్లే సినిమా చూసి కూడా చాలా సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ అవుతారు’ అని చెప్పారు. 

ప్రభాస్ మాట్లాడుతూ ‘గ్రేటెస్ట్ లెజెండ్స్‌‌‌‌‌‌‌‌తో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన దత్తు గారు, నాగీకి  థాంక్ యూ. ఇట్స్ బిగ్గర్ దేన్ డ్రీం. అలాగే దీపిక ఇంటర్నేషనల్ లెవల్‌‌‌‌‌‌‌‌కి రీచ్ అయిన స్టార్. తనతో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్’ అని చెప్పాడు.

 దీపికా పదుకొణె మాట్లాడుతూ ‘ఈ మూవీ  కంప్లీట్ న్యూ వరల్డ్. డైరెక్టర్ నాగీ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇది. యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌గా ఇది అద్భుతమైన ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్’ అని చెప్పింది. ఈ సినిమా గ్రేట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అని నిర్మాత అశ్వినీదత్  అన్నారు. ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ కల్కి టీమ్‌‌‌‌‌‌‌‌తో కలిసి రానా దగ్గుబాటి చేసిన ఇంటరాక్షన్ స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది.