
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ భార్య సునీతను జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన కలిశారు. ఆదివారం ఢిల్లీలోని సునీత నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం కల్పన మీడియాతో మాట్లాడారు. ‘‘జార్ఖండ్‌లో జరిగిన విధంగానే ఢిల్లీలోనూ జరిగింది. నా భర్త హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసిన తర్వాత అర్వింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. జార్ఖండ్ మొత్తం సునీతా కేజ్రీవాల్‌కు అండగా ఉంటుంది. మేమిద్దరం మా బాధలు పంచుకున్నాం. ఇద్దరం కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు.
‘‘కేంద్రంలోని నియంతృత్వ ప్రభుత్వం అర్వింద్ కేజ్రీవాల్‌ను, హేమంత్ సోరెన్‌ను అక్రమంగా అరెస్టు చేసింది. దీనిపై ప్రజలతో కలిసి పోరాడాలని సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్ నిర్ణయించుకున్నారు” అని ఆప్ సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు చేసింది.