
కల్వకుర్తి, వెలుగు: నర్సింగ్ కేర్ వ్యవస్థ రావడానికి కారణమైన ఫ్లోరెన్స్ నైటింగేల్ ను అందరూ స్మరించుకోవాలని కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా సోమవారం దవాఖానలో ఆమెకు నర్సులు, వైద్య సిబ్బందితో నివాళి అర్పించి, కేక్కట్చేశారు.
ఆస్పతుల్లో కాన్పులు చేయడం, వైద్యులు సూచించిన ట్రీట్మెంట్ సకాలంలో ఇవ్వడం, ఆపరేషన్ అయిన వారికి, గాయపడిన వారికి ఇన్ఫెక్షన్ కాకుండా డ్రెస్సింగ్ వంటి కీలక పనులను నర్సింగ్ సిబ్బంది చేస్తున్నారని కొనియాడారు. డాక్టర్లు యశోద, విష్ణు, పాండురంగ, స్వప్న, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు పద్మ, శిరోమణి, బాలమణి, జాయ్ మెర్సీ, సునీత నర్సింగ్ పాల్గొన్నారు.