కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ క్రేజీ అప్డేట్

కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ క్రేజీ అప్డేట్

‘బింబిసార’తో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్, ‘అమిగోస్’ అనే వెరైటీ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆషికా రంగ‌‌‌‌‌‌‌‌నాథ్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో న‌‌‌‌‌‌‌‌వీన్ ఎర్నేని, య‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌మంచిలి ర‌‌‌‌‌‌‌‌వి శంక‌‌‌‌‌‌‌‌ర్ నిర్మిస్తున్నారు. ఇటీవల టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసిన టీమ్, శుక్రవారం ‘యెక యెక యెక.. ఎక్కడుందో స్నేహం వెదికాం’ అనే లిరికల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.

జిబ్రాన్ కంపోజ్ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడాడు. ‘ఒకరికి ఒకరం దొరికాం, రెక్కలు గట్టి ఎగిరొచ్చాం.. దిక్కులు దాటి దిగివచ్చాం, డెస్టినీ పిలుపుకి బదులిచ్చాం, దోస్తీ దివ్వెను వెలిగించాం, అచ్చు గుద్దినట్టు, పోత పోసినట్టు ఒక్కలాగే మనం ఉన్నాం కదా, మాట తీరు..తెన్ను వేరే అయినా గానీ, జట్టు కట్టి జర్నీ చేద్దాం పదా’ అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. ఒకరికొకరు సంబంధం లేకపోయినా ఒకేలా ఉన్న మంజునాథ్, సిద్ధార్థ్, మైఖేల్ అనే ముగ్గురి మధ్య రిలేషన్‌‌‌‌‌‌‌‌ను తెలియజేసేలా ఉందీ పాట. ఫిబ్రవరి 10న సినిమా విడుదల కానుంది.