థ్రిల్ చేసే డ్రీమ్ : 118 మూవీ రివ్యూ

థ్రిల్ చేసే డ్రీమ్ : 118 మూవీ రివ్యూ

రివ్యూ: 118

రన్ టైమ్: 2 గంటల 7 నిమిషాలు

నటీనటులు: కళ్యాణ్ రామ్,నివేతా థామస్,శాలినీ పాండే,ప్రభాస్ శీను,రాజీవ్ కనకాల,హరి ప్రియ తదితరులు

మాటలు: మిర్చి కిరణ్

మ్యూజిక్ : శేఖర్ చంద్ర

నిర్మాత: మహేష్.ఎస్.కోనేరు

కథ,స్క్రీన్ ప్లే,సినిమాటోగ్రఫీ,దర్శకత్వం: కె.వి గుహన్

రిలీజ్ డేట్ : మార్చి 1,2019

కథేంటి?

ఓ న్యూస్ ఛానెల్ లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న గౌతమ్ (కళ్యాణ్ రామ్) కు ఓ రిసార్ట్ లో స్టే చేసినపుడు ఓ కల వస్తుంది. ఆ డ్రీమ్ లో ఆద్య (నివేతా థామస్) ను ఎవరో చంపుతున్నట్టు ఉంటుంది. ఆ రిసార్ట్ లో పడుకున్నప్పుడు మాత్రమే అలా జరుగుతూ ఉంటుంది..అలా ఎందుకు జరుగుతుంది? ఆమె ఎవరు? దానికి సంబంధించిన క్లూస్ తో గౌతమ్ ఆ మిస్టరీని ఎలా చేధించాడనేదే ఈ కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

కళ్యాణ్ రామ్ తన పరిధిమేర బాగా నటించాడు.లుక్స్ పరంగా కూడా తను బాగా కనిపించాడు.నివేతా థామస్ కు మంచి రోల్ దక్కింది.దానికి ఆమె 100 న్యాయం చేసింది.శాలినీ పాండే గురించి చెప్పుకోవడానికేం లేదు.ప్రభాస్ శీను,చమ్మక్ చంద్ర కామెడీ చేయడానికి ట్రై చేశారు.విలన్ పవర్ ఫుల్ గా కనిపించకపోవడం మైనస్.

టెక్నికల్ వర్క్:

డైరెక్టరే సినిమాటోగ్రఫర్ కాబట్టి ఆ క్రాఫ్ట్ మీద బాగా శ్రద్ద పెట్టాడు. తద్వారా సినిమాటోగ్రఫీ అద్భుతంగా వచ్చింది.శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది.ఇలాంటి థ్రిల్లర్ జానర్ కు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ ను బాగా ఇచ్చాడు.ఆర్ట్ వర్క్ అంతా బాగా ఉంది.ప్రొడక్షన్ వాల్యూయ్స్ రిచ్ గా ఉన్నాయి.ఎడిటింగ్ షార్ప్ గా ఉంది.డైలాగులు ఓకే.

విశ్లేషణ:

‘‘118’’ ఓ డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా’’.. డైరెక్టర్ కె.వి గుహన్ రెగ్యులర్ థ్రిల్లర్ ఓ కొత్త బ్యాక్ డ్రాప్ ను ఎంచుకొని ఎంగేజింగ్ గానే తీసాడు.నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను ప్రేక్షకులలో కలిగించడంలో మేజర్ పార్ట్ వరకు సక్సెస్ అయ్యాడు.ఓ థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన సరంజామా అంతా చక్కగా రాసుకున్నాడు. కాకపోతే కొన్నిసార్లు సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ తీసుకున్నాడని పిస్తుంది. స్పెషల్లీ క్లైమాక్స్ లో ‘‘లూసిడ్ డ్రీమ్’’ ఎపిసోడ్. ఫస్టాఫ్ ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. చాలా సీన్లు రేసి గా సాగుతూ ఉత్కంఠను కలిగిస్తాయి.స్క్రీన్ ప్లే కూడా గ్రిప్పింగ్ గా రాసుకున్నాడు గుహన్.అయితే సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నెమ్మదించేసరికి కాస్త బోర్ గా అనిపిస్తుంది.ఓవరాల్ గా చూసుకుంటే డిఫరెంట్ జానర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా సంతృప్తినిస్తుంది.ఈ వీకెండ్ కు ఓ సారి ట్రై చెయ్యవచ్చు.

 బాటమ్ లైన్: థ్రిల్ చేసే డ్రీమ్