రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక

కోనరావుపేట,వెలుగు: కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 14 విభాగంలో పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన వాలీబాల్‌‌‌‌‌‌‌‌ పోటీల్లో నిజామాబాద్ గ్రామానికి చెందిన కల్యాణి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు జిల్లా పాఠశాల క్రీడల సెక్రటరీ నర్రా శ్రీనివాస్ తెలిపారు. 

మండలంలోని నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన కల్యాణి  త్వరలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు. బాలిక ఎంపికపై పీడీ అజయ్ కుమార్, హెచ్ఎం సాబోద్దీన్, టీచర్లు, గ్రామ పెద్దలు, యువత అభినందనలు తెలిపారు.