Kotha Loka : బాక్సాఫీస్‍ను షేక్ చేసిన 'కొత్త లోక'.. రూ.200 కోట్లు' కొల్లగొట్టిన కల్యాణి ప్రియదర్శన్!

Kotha Loka : బాక్సాఫీస్‍ను షేక్ చేసిన 'కొత్త లోక'.. రూ.200 కోట్లు' కొల్లగొట్టిన కల్యాణి ప్రియదర్శన్!

అఖిల్ అక్కినేని సరసన 'హలో' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ తో 'చిత్రలహరి', శర్వానం ద్ సరసన 'రణరంగం' చిత్రాల్లో నటించినా పెద్దగా చాన్స్ రాలేదు. అయితే తన మాతృభాష మలయాళంలో మాత్రమే వరుస సినిమాలు చేస్తూ డూనుకుపోతోంది. తాజాగా సూపర్ ఉమెన్ ' కొత్త లోక ' తో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంటోంది. 

ఈ చిత్రాన్ని వేపేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించగా డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 29న రిలీజైన ఈ మూవీ తొలిరోజే పాజిటివ్ టాక్ తె చ్చుకుంది. ఇప్పటివరకు రూ.200 కోట్లు వసూలు చేసింది. దీనిపై తాజాగా కళ్యాణి ప్రియదర్శన్ ఆనందం వ్యక్తంచేసింది. 'మలయాళంలో 'లోక చాప్టర్ 1 : చంద్ర' సక్సెస్ తర్వాత అందరూ నన్ను ఫీమేల్ సూపర్ హీరో అని పిలుస్తున్నారు. నా ఆనందాన్ని మాటల్లో చె ప్పలేను అని సంతోషం వ్యక్తం చేసింది.

 ఈ సినిమా విజయం సాదిం చడానికి నాతో పాటు మా టీమ్ లోని వారంతా కష్టపడ్డారు. ఈ సక్సెస్ క్రెడిట్ వాళ్లకు కూడా వెళ్తుందని చెప్పుకొచ్చారు ప్రియదర్శన్. నేను ఈ చిత్రానికి సైన్ చేసినప్పుడు ఇంత బాగా ఆడుతుందని అనుకోలే. మంచి స్టోరీలో భాగం కావాలని మాత్రమే ఆలో చించాను. షూటింగ్ చేసే టైంలోనే ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందని అర్థ మైంది. ఈ సినిమాతో ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నరు. హీరోయిన్స్ కూడా ఎలాంటి పాత్రల్లోనైనా చేయగలరు అని అందరికీ నమ్మకం కలిగింది' అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. 

ఈ 'లోక చాప్టర్ 1 : చంద్ర' మూవీని దుల్కర్ రూ. 30 కోట్లతో నిర్మించగా.. ఇప్పటివరకూ.. రూ.202 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని మూవీ టీం తెలిపింది. దేశవ్యాప్తంగా అత్యధిక వసూలు సాధించిన నాలుగో మలయాళి చిత్రంగా రికార్డు సృష్టించిందని వెల్లడించింది. ఈ విజయం పరంపర ఇంకా కొనసాగుతోందని తెలిపింది.