ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి

ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి

సినీనటుడు, మక్కళ్ నీది మయ్యం(MNM)పార్టీ అధినేత కమల్ హాసన్ ఇవాళ(గురువారం) ఆస్పత్రి నుంచి  డిశ్చార్జి అయ్యారు. మూడేళ్ల కిందట శభాష్ నాయుడు సినిమా షూటింగ్ లో కమల్ కు దెబ్బలు తగిలాయి. దీంతో డాక్టర్లు ఆయన కాలులో రాడ్ అమర్చారు. నవంబరు 22న మరోసారి సర్జరీ నిర్వహించి కాలులోని రాడ్ ను తీసివేశారు. కోలుకున్న కమల్ హాసన్ ను గురువారం డిశ్చార్జి చేశారు. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం కమల్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ లో నటిస్తున్నారు.