అవసరమైతే రజినీతో చేతులు కలుపుతాం: కమల్

అవసరమైతే  రజినీతో చేతులు కలుపుతాం: కమల్

చెన్నై: తోటి నటుడు రజనీకాంత్  పార్టీతో కలిసి పని చేస్తామని, తమిళనాడు అభివృద్ధికి పాటుపడతామని మక్కాల్ నీది మయ్యం పార్టీ నాయకుడు కమల్ హాసన్ అన్నారు.  గత 44  సంవత్సరాల నుంచి తమ ఇద్దరి మధ్య మంచి స్నేహాం ఉందని, అవసరమైతే రాష్ట్రాభివృద్ధికి తాము ఒక్కటై పోతామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో విలేకరుల సమావేశంలో రజనీకాంత్‌తో పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉందా అని అడిగినపుడు కమల్ ఈ విధంగా స్పందించారు.  తమిళనాడులో రాజకీయ పరిస్థితులను బట్టి,  ప్రజల శ్రేయస్సు కోసం రజనీకాంత్‌తో చేతులు కలుపుతామని ఆయన అన్నారు.

ప్రజా ప్రయోజనం కోసం కలసి వస్తాం: రజనీ

కమల్ వ్యాఖ్యలపై స్పందించిన రజనీ.. కమల్ హాసన్‌తో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉంటే  ప్రజల ప్రయోజనం కోసం ఖచ్చితంగా కలిసి వస్తామని అన్నారు. దీంతో  రెండు పార్టీలు రాబోయో ఎన్నికల్లో కలసి పోటీ చేసే అవకాశం ఉంది.