మరోసారి ఆస్పత్రిలో చేరిన కమలహాసన్

V6 Velugu Posted on Jan 17, 2022

ప్రముఖ నటుడు,మక్కల్ నీది మయ్యం (MNM)పార్టీ అధినేత కమలహాసన్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఆయన ఉదయం నుంచి ఆస్వస్థతకు గురి కావడంతో… చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కమల్‌ హాసన్‌ ను చేర్పించినట్లు సమాచారం. ఆయన ఇటీవలే అమెరికా వెళ్లి తన దుస్తుల బ్రాండ్ 'హౌస్ ఆఫ్ ఖద్దర్' ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 భారత్ కు తిరిగి రాగానే కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దాంతో చెన్నై శ్రీరామచంద్ర హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే బిగ్ బాస్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ లో పాల్గొన్నారు. మళ్లీ ఇంతలోనే ఆయన ఆస్పత్రిలో  చేరడం కలకలం రేపింది. అయితే, కమల్ సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రిలో  చేరినట్టు తెలుస్తోంది. అయితే  ఆయన ఇవాళ డిశ్చార్జి కానున్నారు. 

కమల్ ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'విక్రమ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. అటు, శంకర్ దర్శకత్వంలో సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన 'ఇండియన్-2' షూటింగ్ లోనూ ఆయన పాల్గొనే అవకాశాలున్నాయి.

 

మరిన్ని వార్తల కోసం...

 

బీసీలకు పదవులు ఇవ్వకుండా మోసం చేస్తున్నరు

Tagged Once Again, Kamal Haasan, hospitalized

Latest Videos

Subscribe Now

More News