
బ్యాక్ టు బ్యాక్ వరుస తమిళ సినిమాలు చేస్తూనే, బిగ్ బాస్ షోకు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు కమల్ హాసన్. తాజాగా ప్రభాస్ మూవీ షూటింగ్‌లోనూ ఆయన జాయిన్ అయ్యారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఎడి’. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానితో పాటు కమల్ హాసన్ కూడా కీలకపాత్రను పోషిస్తున్నారు. బుధవారం నుండి ఆయన ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది.
కమల్ హాసన్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. మరోవైపు శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’లో నటిస్తున్న కమల్ హాసన్.. హెచ్.వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రం, మణిరత్నం డైరెక్షన్‌లో ‘థగ్ లైఫ్’ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు.