
సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం(MNM)పార్టీ అధినేత కమల్ హాసన్ త్వరలో టీవీ చానల్ స్థాపించబోతున్నారు. నవంబర్ 7న కమల్ బర్త్ డే. తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ కోసం ఆయన చానల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. MNM పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయాలంటే టీవీ చానల్ తప్పనిసరని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీని ప్రజల్లోకి తీస్కెళ్లేందుకు చానల్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు.
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో సంప్రదింపులు జరుపుతున్న కమల్ హాసన్ ఆయన సూచనల ప్రకారమే టీవీ చానల్ ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో తన పుట్టిన రోజున ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు కమల్ హాసన్ సిద్ధమవుతున్నారు.