లేటయినా సరే పరీక్షలు పెట్టండి

లేటయినా సరే పరీక్షలు పెట్టండి
  • తమిళనాడు ప్రభుత్వానికి కమలహాసన్ సలహా

చెన్నై: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో పిల్లల చదువులు దాదాపుగా అటకెక్కాయి. ఉన్నత తరగతుల పరీక్షలు మాత్రం వాయిదాలు వేస్తూ వస్తున్నారు. కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేయడం.. ఇప్పటికే పలు రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయడంపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల హాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆలస్యమైనా కేరళ రాష్ట్రం పరీక్షలు నిర్వహించిందని.. కేరళ తరహాలోనే తమిళనాడులో కూడా పరీక్షలు జరపడం మంచిదని ఆయన పేర్కొన్నారు.

ఇంటర్ పరీక్షలపై తమిళనాడు ప్రభుత్వం వాయిదాలు వేస్తూ వస్తోంది. రేపో మాపో తమిళనాట కూడా రద్దు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందన్న వార్తల నేపధ్యంలో ఆయన స్పందించారు. పరీక్షలు రద్దయితే దీర్ఘకాలికంగా విద్యార్థులపై చాలా ప్రభావం చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. అందుకే నిపుణులతో చర్చించి.. అవసరమైతే సిలబస్ తగ్గించి అయినా పరీక్షలు పెట్టడం మంచిదని.. కేరళ బాటలో తమిళనాడు కూడా చర్యలు తీసుకోవాలని కమల్ హాసన్ సూచించారు.