రాజ్యసభ ఎంపీగా కమల్ హాసన్ ప్రమాణం

రాజ్యసభ ఎంపీగా కమల్ హాసన్ ప్రమాణం

న్యూఢిల్లీ: మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌‌ఎం) చీఫ్, సినీ నటుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేశారు.  అంతకుముందు కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయబోతున్నాను. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అని అన్నారు. కాగా, తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి కావడంతో ఎంఎన్‌‌ఎంకు డీఎంకే రాజ్యసభ సీటు కేటాయించగా, కమల్ హాసన్‌‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.