కామారెడ్డిటౌన్, వెలుగు : మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కామారెడ్డి ఇన్చార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. శనివారం నామినేషన్ల స్క్రూటీని ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు.
ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్స్, ట్రైన్సింగ్స్, వెబ్ కాస్టింగ్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్యాటెట్ బాక్స్‌లను సిద్ధం చేయాలని సూచించారు. ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మదన్మోహన్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, కమిషనర్ రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
