ఆఫీసర్లు సమష్టి భాగస్వామ్యంతో పని చేయాలి : జితేశ్​ వి పాటిల్

ఆఫీసర్లు సమష్టి భాగస్వామ్యంతో పని చేయాలి : జితేశ్​ వి పాటిల్

కామారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని విభాగాల ఆఫీసర్లు సమష్టి భాగస్వామ్యంతో పని చేయాలని కామారెడ్డి కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో నోడల్​ఆఫీసర్లతో మీటింగ్​నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..  జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా మందు, డబ్బు పంపిణీ, రవాణా చేసినట్లు ప్రజల దృష్టికి వస్తే సీ విజిల్​యాప్​ ద్వారా ఫిర్యాదు చేయొచ్చన్నారు.

సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లొదన్నారు. నియోజకవర్గానికి మూడు చొప్పున ఫ్లయింగ్​ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల సంఘం వేలెత్తి చూపని విధంగా ఆయా విభాగాల ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో పని చేయాలన్నారు.